బాబ్లీ గేట్లు తెరుచుకున్నా రాని నీళ్ళు

బాబ్లీ గేట్లు తెరుచుకున్నా రాని నీళ్ళు

అంతరాష్ట్ర జలవివాద ప్రాజెక్ట్‌ బాబ్లీ గేట్లు తెరుచుకున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈ నెల 1 నుంచి అక్టోబర్‌

28 వరకు గేట్లు పైకి ఎత్తి ఉంచుతారు. జలసంఘం ప్రతినిదుల సమక్షంలో తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్‌

అధికారుల ఆధ్వర్యంలో గేట్లు ఓపెన్‌ చేశారు. గోదావరి నదిపై నర్మించిన 14 గేట్లను ఎత్తారు. అయితే ఎగువన కూడా

వర్షాలు లేక గోదావరి ఎడారిగా ఉంది. దీంతో గేట్లు ఎత్తినా దిగువకు నీరు రాలేదు. మహారాష్ట్రలో భారీ వర్షాలు

కురిసి అక్కడి ప్రాజెక్టులు నిండితేనే బాబ్లీ దాటి శ్రీరాంసాగర్‌లోకి వరదనీరు వస్తుంది. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌ డెడ్‌

స్టోరేజ్‌లో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story