Top

ఎమ్మెల్యే vs మాజీ మంత్రి.. కడప జిల్లాలో నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం

ఎమ్మెల్యే vs మాజీ మంత్రి.. కడప జిల్లాలో నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
X

కడప జిల్లాలో రాజకీయ విమర్శలు తీవ్ర స్థాయి చేరుకుంటున్నాయి. మైలరవం మండలం గంగానాపల్లి వద్ద ఏర్పాటు చేసిన సోలార్‌ పార్క్‌ను ధ్వంసం చేశారు దుండుగులు. దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన 2 వేల సోలార్‌ ప్యానెళ్ల సామాగ్రిని నాశనం చేశారు. రెండు నెలలుగా... ఈ పార్క్‌కు సంబందించి నియమాకాలు, కాంట్రాక్ట్‌ పనుల విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది. జమ్ముల మడుగు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య.... సోలార్‌ పనులకు సంబందించిన వివాదం జరుగుతోంది.

ఇప్పుడు ఈ రెండు వర్గాలకు చెందిన వ్యక్తులకు సంబందించి ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌ పనుల వ్యవహరంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏకంగా ఆందోళనలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో... తాజాగా జరిగిన సోలార్‌ ఫ్యానెళ్ల ధ్వంసం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై సోలార్‌ పార్క్‌ నిర్వాహకులు... మహీంద్ర సస్టైన్‌ కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story

RELATED STORIES