మాయమాటలు చెప్పి 25 మంది యువతులను..

మాయమాటలు చెప్పి 25 మంది యువతులను..

ఆన్‌లైన్ లో పరిచయం అయ్యాడు.. మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో యువతిని నమ్మించాడు. ఆమెకు దగ్గరైనట్టు నటించాడు. తర్వాత చేతివాటం చూపడం మొదలుపెట్టాడు. వంచకుడి మాటలు నమ్మి ఇంట్లో బంగారు కూడా దొంగిలించి మరీ మోసగానికి డబ్బులిచ్చింది యువతి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ మోసం వెలుగుచూసింది. యానాంకు చెందిన కర్రి సతీష్ అనే యువకుడికి ఇన్‌స్టాగ్రామ్ లో సూర్యాపేటకు చెందిన యువతితో పరిచయం అయింది. కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పాడు. యువతి కూడా ఆ మాయమాటలు నమ్మింది. కొంతకాలం తర్వాత కారు కొంటున్నానని డబ్బులు కావాలని అమెను అడిగాడు. దీంతో యవతి ఇంట్లో 20 తులాల బంగారు నగలు దొంగిలించి మోసగాడికి అప్పగించింది. ఇంట్లో వాళ్లకు బంగారం కనపడడం లేదని అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది.

బంగారం పోయిందని కేసు నమోదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానం వచ్చి యువతిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో యానాం ప్రాంతానికి చెందిన కర్రి సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అతడి వృత్తే మోసం చేయడమని తేలింది. గతంలో కూడా దాదాపు 25 మంది యువతులను ఇలాగే మోసం చేసినట్టు గుర్తించారు. అమ్మాయిలకు వలవేస్తూ... తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్నట్టు కూడా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story