ఈ వారం స్మాల్ స్క్రీన్ మీద నంబర్ వన్ పొజిషన్ ఎవరికంటే..!

ఈ వారం స్మాల్ స్క్రీన్ మీద నంబర్ వన్ పొజిషన్ ఎవరికంటే..!
X

స్మాల్ స్క్రీన్ మీద టాప్ పొజిషన్లో ఏ మార్పులు రావడం లేదు. ప్రతి వారంలానే స్టార్ మాటివి ఈ సారి కూడా నంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో ఈటివి, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసుల్లో జీ తెలుగు, జెమిని టివి చోటు సంపాదించుకున్నాయి. ఈ నాలుగు చానల్లే స్మాల్ స్క్రీన్ మీద ప్రతి వారం టాప్ ఫోర్ లిస్ట్ లో ఉంటున్నాయి. సీరియల్స్ తోనూ, వీక్లి ప్రోగ్రామ్స్ తోనూ పోటీ పడుతూ, టాప్ పొజిషన్ కోసం ట్రై చేస్తున్నాయి. మాటివి హంగామా బుల్లితెరపై కొనసాగుతోంది. ఈ వారం కూడా రేటింగ్స్ లో టాప్ పొజిషన్ తెచ్చుకుంది మాటివి. ఇందులో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ కి రేటింగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా కొన్ని సీరియల్స్ టాప్ రేంజ్ రేటింగ్ సాధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కార్తీకదీపం రేటింగ్, ఓ పెద్ద హీరో సినిమా ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అయినప్పుడు ఎంత రేటింగ్స్ వస్తాయో, అంతగా ప్రతి ఏపిసోడ్ ఆకట్టుకుంటోంది. ఈ వారం కార్తీకదీపం సీరియల్ కి 14.57 పాయింట్ల రేటింగ్ వచ్చింది.

మాటివిలో ఆదరణ పొందుతున్న సీరియల్స్ లో కోయిలమ్మ ఒకటి. ఎప్పటి నుంచే మంచి టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ కి, కొద్ది వారాలుగా రేటింగ్ పెరుగుతోంది. ప్రతి వారం టాప్ టెన్ లిస్ట్ లో చోటు దక్కించుకుంటోంది. ఈ వారం కోయిలమ్మకి 10.52 పాయింట్లు దక్కాయి. ఆ తర్వాత మౌనరాగం సీరియల్ కి మంచి రేటింగ్ వస్తోంది. మాటలు రానీ ఓ అమ్మాయి కథతో తెరకెక్కుతున్న ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.వీటితో పాటు మాటివిలో టెలికాస్ట్ అవుతున్న మిగతా సీరియల్స్ కథలో రాజకుమారి, సిరిసిరి మువ్వులు, వదినమ్మ, సావిత్రమ్మ గారి అబ్బాయికి మంచి రేటింగ్ వస్తోంది. కథలో రాజకుమారి సీరియల్ కి 7.52 పాయింట్లు, వదిమ్మకి 7 పాయింట్లు, సిరిసిరి మువ్వులుకి 5.27 పాయింట్లు దక్కాయి. వీటితో పాటు కుంకుమపువ్వు సీరియల్ కి 4.60 పాయింట్లు దక్కాయి. అలాగే అగ్నిసాక్షికి 4.50 పాయింట్లు వచ్చాయి. సీరియల్స్ రేటింగ్స్ స్టార్ మాటివి టాప్ పొజిషన్ లో ఉండటానికి కారణం.

ఈటివి.. జీ తెలుగు చానల్ ని వెనక్కి నెట్టి, ఈ వారం కూడా సెకండ్ ప్లేస్ సాధించింది. ఇందులో సీరియల్స్ కంటే వీక్లి ప్రోగ్రామ్స్ కి ఎక్కువగా రెస్పాన్స్ వస్తోంది. కానీ సీరియల్స్ లో ఒకటి, రెండు మినహా మిగతా వాటికి అంతగా రెస్పాన్స్ రావడం లేదు. సీరియల్స్ పై మరింత కాన్సన్ట్రేట్ చేస్తే...ఈటివి రేటింగ్ మరింత పెరగొచ్చు. ఓవరాల్ గా సెకండ్ ప్లేస్ సాధించిన ఈటివిలో... ఇండివిడ్యువల్ గా టాప్ రేటింగ్ సాధించింది ఎక్స్ ట్రా జబర్ధస్త్. ఈ కామెడీ షోకి ఈ వారం 6.15 పాయింట్లు దక్కాయి. ఆ తర్వాత దీంతో పాటు జబర్ధస్త్ కి 6.07 పాయింట్లు వచ్చాయి. వీటితో పాటు డాన్స్ బేస్డ్ షో డీ జోడీకి ఈ వారం 5.41 పాయింట్ల రేటింగ్ వచ్చింది. ఈటివిలో సీరియల్స్ రేటింగ్ చూస్తే...స్వాతి చినుకులుకి 6.13 పాయింట్లు దక్కాయి. ఆ తర్వాత నా పేరు మీనాక్షి సీరియల్ కి 5 పాయింట్లు వచ్చాయి. ఇక మనసు మమత సీరియల్ 4.72 పాయింట్లు సాధించింది. మిగతా సీరియల్స్ కి 4 పాయింట్ల రేటింగ్ రావడం కష్టమవుతోంది.

జీ తెలుగు చానల్ ఈ వారం సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ చానల్ లో ఈ వారం టాప్ రేటింగ్ సాధించింది రక్తసంబంధం సీరియల్. ఈ సీరియల్ కొద్ది వారాలుగా ఫస్ట్ ప్లేస్ సాధిస్తోంది. ఈ సీరియల్ కి 5.37 పాయింట్లు వచ్చాయి. మాటేమంత్రము సీరియల్ 4.47 పాయింట్లు సాధిస్తే, గంగ మంగ సీరియల్ 4.34 పాయింట్లు తెచ్చుకుంది. అలాగే గుండమ్మకథకి 4.26 పాయింట్లు వచ్చాయి. కళ్యాణ వైభోగమే, నిన్నే పెళ్ళాడతా వంటి సీరియల్స్ కి 4 పాయింట్లు కూడా రాలేదు.

జెమిని టీవి ఈ వారం కూడా ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఈ చానల్ లో ఇప్పుడిప్పుడే సీరియల్స్ కి రేటింగ్ పెరుగుతోంది. రెండు రెళ్ళు ఆరు సీరియల్ జెమినిలో టాప్ రేటింగ్ తెచ్చుకుంటోంది. ఈ సీరియల్ కి 4.96 పాయింట్లు వచ్చాయి. పౌర్ణమి సీరియల్ కి 4.61 పాయింట్లు దక్కాయి. అలాగే రోజా సీరియల్ కి 3.95 పాయింట్లు వచ్చాయి. ఇక అక్క మొగుడు సీరియల్ 3.60 పాయింట్లు సాధించింది. మొత్తంగా జెమిని టివిలోని సీరియల్స్ కి ఈ మధ్య రేటింగ్ పెరుగుతుండటం విశేషంగా చెప్పాలి.

Next Story

RELATED STORIES