ఆస్తి కోసం భర్తను కొడుకుల సాయంతో హతమార్చిన భార్య

X
TV5 Telugu2 July 2019 7:39 AM GMT
ఆస్తి కోసం కట్టుకున్న భర్తను కొడుకుల సాయంతో హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. బిర్కూర్ మండలం కిష్టాపూర్‌లో ఈ ఘటన కలకలం రేపింది. కామయ్యకు గత కొంతకాలంగా ఆస్తిపంపకాల విషయంలో భార్య లాలవ్వ, కొడుకులు విరేశం, సాయిలుతో విభేదాలున్నాయి. దీంతో కామయ్య ఇంటి నుంచి వెళ్లిపోయి కమ్యూనిటీ హాల్‌లో ఉంటున్నాడు. కామయ్య నిద్రిస్తున్న సమయంలో ఆర్థరాత్రి లాలవ్వ తనకొడుకులతో వెళ్లి దాడి చేసింది. ఆ తర్వాత ఉరివేసి చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story