ఆ ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డ్..

ఆ ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డ్..

ఇప్పటికే పరిమితికిమించి అడ్మిషన్లు జరిగాయి. ఇక మీ పిల్లలను స్కూల్లో చేర్చుకోలేం. దయచేసి తల్లిదండ్రులు సహకరించండని కర్నూలు జిల్లా ఆదోనిలోని నెహ్రూ స్మారక మున్సిపల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ అంటున్నారు. పేరుకు ప్రభుత్వ పాఠశాలే అయినప్పటికీ ఇక్కడి నాణ్యమైన బోధన కారణంగా పిల్లల తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం క్యూ కడుతుంటారు.

అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల తాకిడి ఎక్కువ కావడంతో స్కూల్‌ ముందు No Admission బోర్డ్‌ పెట్టారు. ఇలా బోర్డు పెట్టడం వరుసగా ఇది రెండో ఏడాది. ఈ స్కూల్లో 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు 15 వందల 56 మంది విద్యార్థులున్నారు. ప్రతి విద్యార్థి పురోగతిపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు టీచర్లు. ఫలితాలు ప్రయివేటు స్కూళ్లకి ఏ మాత్రం తగ్గకుండా ఉంటున్నాయి.

ప్రతి క్లాస్‌లోనూ విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రూపులుగా విభజించి తీర్చిదిద్దుతున్నారు. తమ పిల్లలను ప్రయివేటు స్కూళ్లలో చదివించిన పేరెంట్స్‌ కూడా... నెహ్రూ స్మారక స్కూల్‌లో చేర్పించడానికే మొగ్గుచూపుతున్నారు. అయితే ఉపాధ్యాయుల కొరత, గదుల కొరత వల్ల పిల్లలను చేర్పించుకోలేకపోతున్నామని ప్రిన్సిపల్‌ అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story