ఏటీఎం చోరీకి స్కెచ్ వేశాడు.. చివరికి..

నల్గొండ జిల్లాలో ఓ దొంగ.. ఏటీఎం దోచేద్దామని స్కెచ్ వేసి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. చుండూరు మండలం గట్టుప్పలలోని ఏటీఎంలో చోరీకి అతను పక్కా స్కెచ్ వేశాడు. ఎవరూ లేని టైమ్ చూసి జాగ్రత్తగా లోపలికి వెళ్లాడు. సుత్తి, గునపం లాంటి వాటితో మొత్తానికెలాగో మెషీన్ పగలగొట్టేశాడు. మరికొద్ది నిమిషాలైతే డబ్బుతో జంపైపోయేవాడే. ఇంతలో కథ అడ్డం తిరిగింది. ఈ దొంగోడు ఊళ్లోవాళ్ల కంట్లో పడ్డాడు. దీంతో.. తప్పించుకునేందుకు బైక్ ఎక్కి పారిపోయే ప్రయత్నం చేశాడు. గ్రామస్థులు వెంట పడడంతో స్పీడ్ పెంచి కంగారులో యాక్సిడెంట్ చేశాడు. దెబ్బకు ఎగిరి కిందపడ్డాడు. తలకు పెద్ద గాయమైంది. వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేసిన స్థానికులు.. తర్వాత పోలీసులకు పట్టిచ్చారు. ఐతే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ దొంగ మృతి చెందాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com