మనసున్న మంచి డాక్టర్.. పేద విద్యార్థులకు ఉచితంగా మెడికల్ కోచింగ్..

మనసున్న మంచి డాక్టర్.. పేద విద్యార్థులకు ఉచితంగా మెడికల్ కోచింగ్..

వైద్యులకు మంచి మనసు ఉంటే తక్కువ ఫీజు తీసుకుని వైద్యం చేస్తారు. మారు మూల గ్రామాలకు వెళ్లి ఉచితంగా వైద్యం అందిస్తారు. పేదలు ఆయనను దేవుడిగా వారి గుండెల్లో పెట్టుకుంటారు. ఈ డాక్టర్ మరో అడుగు ముందుకు వేసి డాక్టర్ చదవాలని కోరిక ఉన్న విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. ఓ పక్క వైద్యం చేస్తూనే డాక్టర్ చదవాలనే కోరిక ఉన్న పేద విద్యార్ధులకు ఉచితంగా మెడికల్ కోచింగ్ ఇస్తున్నారు రాజస్థాన్‌లోని బర్మర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ భరత్ సరన్. 50 విలేజర్స్ పేరుతో ఓ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించిన భరత్.. పేద విద్యార్థులకు ఉచితంగా మెడికల్ కోర్స్ ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ ఇస్తున్నారు.

విద్యార్థులకు మంచి ర్యాంక్ వస్తే ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సీటు వస్తుంది. చదువుకోవడానికి కాస్త వెసులుబాటుగా ఉంటుంది. అందుకు కోచింగ్ తీసుకోవాలంటే కోచింగ్ సెంటర్లు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తుంటాయి. పేద విద్యార్థులకు అంత ఆర్థిక స్థోమత ఉండదు. కానీ డాక్టర్ చదవాలన్న కోరిక బలంగా ఉంటుంది. అలాంటి వారికి మాత్రమే ఆయన కోచింగ్ ఇస్తారు. అటువంటి విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చి వాళ్లకు మంచి ర్యాంక్ వచ్చేలా తీర్చిదిద్దుతారు. ప్రస్తుతం ఆయన 11వ క్లాస్ విద్యార్థులు 25 మందికి, 12వ క్లాస్‌కు చెందిన 25 మంది విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు.

పేద విద్యార్థులకు మేమూ చేయందిస్తామంటూ కొందరు దాతలు సహృదయంతో ముందుకు వస్తుంటారు. ఆర్థికంగా సహాయపడుతుంటారు. ప్రతి సంవత్సరం 50 మందికి కోచింగ్ ఇచ్చే లక్ష్యంగా ఇనిస్టిట్యూట్‌ స్థాపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది. కోచింగ్‌లో భాగంగా.. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, భోజనం అందిస్తారు. ఇక్కడ కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు ఎయిమ్స్ వంటి కాలేజీల్లో కూడా సీట్లు వస్తాయి. విద్యార్థులు రోజుకి 11 నుంచి 12 గంటలు ఇనిస్టిట్యూట్‌‌లోనే ఉండి చదువుకోవడం, డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవడం చేస్తుంటారు. పేద విద్యార్థుల చదువుకై ఆర్థికంగా ఆదుకుంటున్న వారందరికీ డాక్టర్ భరత్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story