హీరో శివాజీకి నోటీసులు ఇచ్చిన పోలీసులు

హీరో శివాజీకి నోటీసులు ఇచ్చిన పోలీసులు
X

హీరో శివాజీకి పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఈనెల 11వ తేదీన తిరిగి హాజరు కావాలని ఆదేశించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు..41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి పంపామని పోలీసులు చెబుతున్నారు.

అలంద మీడియా కేసులో శివాజీని... సైబరాబాద్‌ పోలీసులు ఈ ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చాక వదిలేశారు.

Next Story

RELATED STORIES