మొగల్తూరులో కామాంధుడి భరతం పట్టేందుకు సిద్దమైన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కామాంధుడి భరతం పట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మహిళలను లొంగదీసుకుని.. వారి అశ్లీల వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్‌ చేసిన ఆగిశెట్టి సాయిని మొగల్తూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్‌ చేసిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నలుగురు నిందితులపై పలు సెక్షన్‌లపై కేసులు నమోదు చేశామన్నారు డీఎస్‌పీ నాగేశ్వరరావు..

ఇప్పటికే సాయి మాయమాటలతో చాలామంది మహిళలు మోసపోయారని పోలీసులు గుర్తించారు. మొబైల్ ఫోన్ల రిపేరు కోసం షాపునకు వచ్చే మహిళలనే టార్గెట్ చేశాడు. మాయమాటలు చెప్పి వారిని ముగ్గులోకి దింపేవాడు. తర్వాత పడక గదికి తీసుకెళ్లి ఆ అశ్లీలన్నంతా మొబైల్ ఫోన్‌తో గుట్టుగా వీడియో తీసేవాడు. అలా మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోలను తన కంప్యూటర్‌లో దాచుకున్నాడు. అయితే అదే షాపులో వరసకు సోదరుడైన గోపీనాథ్‌ ఈ వీడియోలను చూసి కాపీ చేసుకున్నాడు. వాటిని అదే గ్రామంలోని తన స్నేహితుడు బాబులు, మరికొంతమంది ఫ్రెండ్స్‌కి షేర్ చేశాడు. ఈ వీడియోలను అడ్డంపెట్టకుని సెల్ పాయింట్ ఓనర్ అవిశెట్టి సాయిని డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టాడు బాబులు. అడిగినంత ఇస్తే సరే లేదంటే... అశ్లీల వీడియోలను వాట్సప్ గ్రూపుల్లో పెడతానంటూ బెదిరించాడు. సాయి.. ఈ డిమాండ్‌కు ఒప్పుకోకపోవడంతో బాబులు అన్నంత పనిచేశాడు. ఆ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. అవన్నీ క్షణాల్లో వైరల్‌గా మారాయి. అంతేకాదు ఈ వీడియోల్లో ఉన్న యువతులకు బ్లాక్ మెయిల్ చేశాడు. అతడి టార్చర్ భరించలేక ఓ బాధితురాలు మొగల్తూరు పోలీసులను ఆశ్రయించింది..

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... నిందితులు అవిశెట్టి సాయి, గోపీనాథ్‌, బాబులుపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే సాయిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read MoreRead Less
Next Story