ప్రమాణ స్వీకారం చేయకుండానే పదవి కోల్పోయిన కృష్ణవేణి

ప్రమాణ స్వీకారం చేయకుండానే పదవి కోల్పోయిన కృష్ణవేణి
X

ప్రమాణ స్వీకారం చేయకుండానే ఓ ఎంపీపీ పదవిని కోల్పోయింది.. విప్‌ దిక్కరించడంతో ఎంపీటీసీ కృష్ణవేణిపై వేటు పడింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టిఆర్‌ఎస్ 2, కాంగ్రెస్‌ 5, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. ఇద్దరు స్వతంత్రులు టిఆర్‌ఎస్‌కు, మరో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఆరుగు సభ్యుల మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుటుందని అంతా భావించారు.

అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన ధర్మారావు పేట ఎంపీటీసీ సభ్యురాలు కృష్ణవేణి టిఆర్‌ఎస్‌ సభ్యుల మద్దతుతో ఎంపీపీ బరిలో నిలిచింది. కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లకు సమాన సీట్లు రావడంతో లాటరీలో కృష్ణవేణిని ఎంపీపీ పదవి వరించింది. అయితే విప్‌ దిక్కరించారని కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదులతో.. ఆమె ఎంపీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎంపీపీ పదవి కూడా పోయింది.

Tags

Next Story