ఉపసర్పంచ్ దారుణ హత్య

ఉపసర్పంచ్   దారుణ హత్య
X

నల్గొండ జిల్లా చందంపేట మండలంలో దారుణ హత్య జరిగింది. గుంటిపల్లి బంజారానగర్ తండాకు చెందిన ఉపసర్పంచ్ రమావత్ లాల్యను నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టిచంపారు. సమీపంలోని కాలమందతండాకు చెందినవారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వ్యక్తిగత కక్షలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మృతుడి బంధువులు మృతదేహంతో నిందితుల ఇంటిముందు ధర్నాకు దిగారు. కోపంతో వారి ఇళ్లను ధ్వంసం చేశారు. హత్యచేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాంఢ్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES