తాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కత్తుల కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కత్తుల కలకలం
X

శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఓ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి వద్ద కత్తులు దొరకడం కలకలం రేపుతోంది. గోల్కొండకు చెందిన కరీముద్దీన్ విమానాశ్రయంలోని ఓమ్ లైన్ సంస్థలో పనిచేస్తున్నాడు. డ్యూటీ కోసం వస్తున్న కరీముద్దీన్ ను భద్రతా సిబ్బంది చెక్ చేసింది. అతడి బ్యాగులో రెండు కత్తులు లభించాయి. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అతడిని వెంటనే పోలీసులకు అప్పగించారు. కరీముద్దీన్ కత్తులతో ఎయిర్ పోర్టులోకి ఎందుకు వచ్చాడన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే కరీముద్దీన్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.

Next Story

RELATED STORIES