తాజా వార్తలు

మాయమాటలు చెప్పి ఐదేళ్ల బాలికపై..

మాయమాటలు చెప్పి ఐదేళ్ల బాలికపై..
X

హైదరాబాద్‌ శివార్లలోని హైదర్‌గూడలో ఐదేళ్ల బాలికపై మైనర్లయిన ఇద్దరు అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడ్డారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌కు చెందిన సుబ్బయ్య, చంద్రకళ మూడేళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఎర్రబోడలో ఉంటున్నారు. అదే కాలనీలో ఉండే రాములు, విజయలక్షి దంపతుల కుమారులు శ్రావణ్, సందీప్.. మాయమాటలు చెప్పి ఐదేళ్ల అమ్ములుపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

మూడు రోజుల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల అమ్ములును భవనంపైకి తీసుకెళ్లి ఇద్దరు సోదరులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి నిందితుల ఇంటిపై దాడి జరగడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్ర నగర్‌ పోలీసులు రంగంలోకి దిగి.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల తండ్రి సుబ్బయ్య GHMC సర్కిల్‌లో ఉద్యోగిగా ఉన్నాడు.

Next Story

RELATED STORIES