తెలంగాణలో పోడు భూముల వివాదం

తెలంగాణలో పోడు భూముల వివాదం

పోడు భూముల వివాదం తెలంగాణలో కలకలం సృష్టిస్తోంది. అటవీ భూముల సాగు అధికారుల, అడవి బిడ్డల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది. ఇటీవల కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ తో పాటు ఖమ్మం జిల్లాలోను అటవీ శాఖ సిబ్బందిపై దాడులు జరిగాయి. తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేటలోను అధికారులు, గిరిజనులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జై సేవాలాల్‌ ఉరుతాండలో భూములను దున్నుకుంటున్న గిరిజన రైతులను సెక్షన్ ఆఫీసర్ బీర్బల్‌ నాయక్ అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.

గతంలో మూలవాగు ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన సమయంలో సర్వే 7లోని 150 ఎకరాల భూమిని తామంతా 35 సాగు చేసుకుంటున్నామని రైతులు చెప్పారు. 20 బోర్లు వేసి, చదును చేసి, సాగు చేయడానికి దాదాపు ఎకరానికి 2 లక్షల ఖర్చయిందన్నారు. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే జరిపించి 10 ఎకరాలకు పట్టా పాస్‌ పుస్తకాలు ఇచ్చిందని తెలిపారు. 2017లో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం సర్వే జరిపించినా, ఇప్పటివరకు పట్టాపుస్తకాలు ఇవ్వలేదని వాపోయారు. వ్యవసాయం తప్ప వేరే పని తెలియదని, భూములు లాక్కుంటే చావే శరణ్యమంటున్నారు. ఎమ్మెల్యేరమేశ్‌ బాబు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పోడు భూములపై స్పందించి, తమను ఆదుకోవాలని కోనరావుపేట రైతులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story