ఆ వేడుకకు నేను రావడం లేదు..మీరు అలా చేస్తే ఫ్యాన్స్ బాధపడతారు

ఆ వేడుకకు నేను రావడం లేదు..మీరు అలా చేస్తే ఫ్యాన్స్ బాధపడతారు
X

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విటర్‌ వేదికగా ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి అమెరికాలో పర్యటిస్తున్నారు. త్వరలో జరగనున్న తానా సభలకు హాజరయ్యేందుకే అమెరికా వెళ్లారని పలు మీడియాలలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ఆయన ట్విటర్‌లో స్పందించారు. 'వ్యక్తిగత పని కోసం వాషింగ్టన్‌కు వచ్చాను. తానా వేడుకల్లో పాల్గొనడానికి కాదు. మీ కథనాల వల్ల నేను వేడుకలకు హాజరవుతానని అభిమానులు ఆశిస్తారు. తీరా రాకపోయేసరికి వారు బాధపడే అవకాశం ఉంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని ఈ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. . చిత్రీకరణలో భాగంగా కొన్ని సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు.అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన పోరాట యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ యువ‌కులుగా ఉన్న‌ప్పుడు ఏం చేశార‌నే క‌థాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Next Story

RELATED STORIES