తాజా వార్తలు

రూ.20లకే చీర.. పొలోమని బారులు తీరిన మహిళలు

రూ.20లకే చీర.. పొలోమని బారులు తీరిన మహిళలు
X

ఏదైనా ఆఫర్‌లో వస్తుందంటే వదులుకోవడానికి ఎవ్వరూ సిద్దపడరు. ఆఫర్ల విషయంలో మహిళలు కొంత ముందుంటారు. అలాంటిది చీరలు ఏకంగా 80 శాతం డిస్కౌంట్ లో వస్తున్నాయంటే ఊరుకుంటారా.. షాపుముందు గుంపులుగా వాలిపోరు ..ఇదే జరిగింది పెద్దపల్లిలో. పెద్దపల్లిలోని ఓ వస్త్ర దుకాణంలో రూ.20లకే చీర అని ఆఫర్‌ పెట్టడంతో మహిళలు బారులు తీరారు. అంతమంది పొలోమని రావడంతో... ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయింది. షాపులో, రోడ్డుపై, ఆ వీధి మొత్తం మహిళలతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చుట్టుపక్క గ్రామాల మహిళలంతా షాపు వద్దకి పోటెత్తారు. ఉదయం నుంచే దుకాణం ముందు బారులు తీరారు. ఈ క్రమంలో చీరలను కొనుగోలు చేసేందుకు ఒకరిని ఒకరు తోసుకోవడంతో తోపులాట జరిగింది. అయితే షాపు నిర్వాహకులు వారిని కట్టడి చేశారు.

Next Story

RELATED STORIES