వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం

X
By - TV5 Telugu |5 July 2019 2:20 PM IST
వేతన జీవుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది కేంద్రం. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. మధ్య తరగతి ఆదాయ వర్గాల ప్రజలు పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల నుంచి కనీసం 3 లక్షలకు పెంచుతారాని ఆశలు పెట్టుకున్నారు. కానీ మరోసారి మొండిచేయే చూపించింది కేంద్రం...ఐదేళ్ల కిందట 2014-15లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును 2 లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. అప్పటి నుంచి వేతనజీవులను ఊరిస్తూ వస్తున్న కేంద్రం మళ్లీ నిరాశే మిగిల్చింది..అయితే పన్ను పడే ఆదాయం 5 లక్షల దాకా ఉన్నవారికి మాత్రం మినహాయింపునిచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com