కొత్త నాణేలు.. చూపు లేని వారు కూడా గుర్తించే విధంగా..

కొత్త నాణేలు.. చూపు లేని వారు కూడా గుర్తించే విధంగా..

నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. దీనిలో భాగంగానే కొత్త నాణేలను ప్రవేశ పెడుతున్నట్లు తెలియజేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం వాటి స్థానంలో 500లు, 2000లను కొత్త నోట్లను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం 10,50 నోట్లలో కొద్ది మార్పులు చేసిన కేంద్రం కొత్త 200 నోటుని కూడా తీసుకువచ్చింది. తాజా బడ్జెట్‌లో కూడా కొత్త నాణేలు తీసుకొస్తామంటున్నారు ఆర్థిక మంత్రి.. అవి 1,2,5,10,20 త్వరలో ఈ నాణేలు ప్రవేశపెడుతున్నారు. అంధులు కూడా గుర్తించే విధంగా ఈ నాణేలను రూపొందిస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు.

Read MoreRead Less
Next Story