పోలవరం ప్రాజెక్ట్ పనులపై రివ్యూ

పోలవరం ప్రాజెక్ట్ పురోగతి పనులపై.. రివ్యూ చేసింది ప్రాజెక్ట్ అథారిటీ. విజయవాడ బందరు రోడ్డులోని ఇరిగేషన్ శాఖ ఆఫీసులో ఈ అథారిటీ సమావేశమైంది. పోలవరం వద్ద నిర్మించిన కాఫర్ డ్యాం రక్షణపైనా చర్చలు జరిపారు. ప్రస్తుతం కాపర్ డ్యాం... పాక్షికంగానే పూర్తైంది. వరదలు రాకముందే... ఇక్కడ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారు సీఎం జగన్. దీంతోపాటు ప్రాజెక్ట్‌కు రాబోయే వరదపై అంచనాలు, భూసేకరణ, పునరావాస ప్రక్రియపై చర్చించారు.
ఈ సారి పోలవరం డ్యామ్‌కు పదివేల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సీఈవో రాజేంద్రకుమార్ జైన్. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇప్పటివరకు 6700 కోట్లు విడుదుల చేసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో ముడేళ్లు సమయం పట్టే అవకాశం ఉందన్నారు పీపీఏ సీఈవో రాజేంద్రకుమార్ జైన్. 2022 నాటికి ఇది పూర్తియ్యే అవకాశం ఉందన్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తామన్నారు పీపీఏ సభ్యులు . పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ అంచనాలను పెంచే విషయంలో ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తుందన్నారు రాజేంద్ర కుమార్ చెప్పారు. ఈ రివ్యూ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఆధిత్యదాస్, సీఈవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కమిటీ.. ప్రాజెక్ట్ పురోగతిపై.. సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఓ నివేదిక అందజేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com