ఏ టైమ్‌లో పుట్టావమ్మా..

ఏ టైమ్‌లో పుట్టావమ్మా..
X

ప్రశంసించాలన్నా, విమర్శించాలన్నా దానిక్కూడా ఓ అర్హత ఉండాలి. అందునా తోటివారిపై ప్రశంసలు కురిపించాలంటే మనసులో నుంచి రావాలి.. మనస్ఫూర్తిగా అనిపించాలి. సహ నటి సమంతపై చార్మింగ్ బ్యూటీ చార్మీ ప్రశంసల జల్లు కురిపించింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరమైనా పూరీ ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు చూస్తూ ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంటోంది చార్మీ. సమంత నటించిన ఓ బేబీ చూసి చార్మీ.. ఏ టైంలో పుట్టావమ్మా నువ్వు.. నీ శ్రమ, నీ నిర్ణయాలు, నీ జాతకానికి నమస్కారం.. నందినీ రెడ్డి, మిగిలిన చిత్ర బృందం పట్ల చాలా సంతోషంగా ఉంది అంటూ సామ్ రాక్స్, ఓ బేబీ రాక్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్టుకి సమంత రిప్లై ఇస్తూ.. నువ్వెంతో క్యూట్.. ధన్యవాదాలు చార్మీ.. నీకు నా ప్రేమ పూర్వక కౌగిలిని, ముద్దుల్ని పంపుతున్నా అని ట్వీట్ చేసింది. ఓ బేబీగా నటించిన సమంత సినిమా కోసం చాలా కష్టపడింది. ఇష్టంగా ప్రమోషన్ బాధ్యతలను భుజాన వేసుకుని కష్టపడింది. తన కష్టానికి ఫలితం దక్కి ఓ బేబీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బేబీగా నవ్విస్తూనే ఏడిపించిన సమంతని ప్రేక్షకులు ఆదరించారు.

Next Story

RELATED STORIES