ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోవడానికి నాకు అంత టైం పట్టింది - పవన్

X
TV5 Telugu6 July 2019 6:35 AM GMT
రాజకీయాల్లోకి తాను భయపడుతూ రాలేదని... ఓటమిని కూడా అంగీకరించే ధైర్యం ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఓటిమితో ఎగతాళి చేస్తారని.. కామెంట్లు వస్తాయని ముందే ఊహించామన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన తానా సభల్లో ఆయన ఇటీవల ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. అపజయాలు తనకు కొత్తకాదని.. స్కూల్ పరీక్షల్లో కూడా విఫలం అయి.. తర్వాత విజయాలు అందుకున్నట్టు తెలిపారు. సినిమాల్లో అవగాహన లేకపోయినా నేర్చుకున్నాను. కేవలం 15 నిమిషాల్లో ఎన్నికల్లో ఓటమిని అంగీకరించగలిగానన్నారు. డబ్బు రాజకీయాలను ప్రభావితం చేసినా.. తాను మాత్రం నిజాన్ని, నిజాయితీని నమ్ముకుని భవిష్యత్తు పోరాటం చేస్తానంటున్నారు.
Next Story