ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడి కోసం భర్తని..

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడి కోసం భర్తని..

నల్లగొండ పట్టణంలో సంచలనం సృష్టించిన బిల్డర్ సోమకేశవులు హత్య కేసును చేధించారు పోలీసులు. భార్య స్వాతినే.. రెండు లక్షల రూపాయల సుపారీ ఇచ్చి హత్యచేయించిన సూత్రధారిగా తేల్చారు. ఆమెతోపాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి.. హత్యకు ఉపయోగించిన సుత్తి, టవల్, బైక్ సహా ఆరు మొబైల్స్ సీజ్ చేశారు. ప్రియుడితో నడిపిస్తోన్న వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడంటూ.. భర్త సోమకేశవులు హత్యకు ప్లాన్ చేసిన స్వాతి.. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది.

ఈనెల రెండో తేదీన.. నల్లగొండ పట్టణం శివారులోని గంధంవారిగూడెంలోని చైతన్యపురిలో.. బిల్డర్ సోమకేశవులు హత్య కలకలం రేపింది. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారంలో లావాదేవీలు ఏమైనా హత్యకు దారి తీసాయా.. అన్న కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. అనుమానం వచ్చిన పోలీసులు భార్య స్వాతిని విచారించారు. ఆమెకున్న అక్రమ సంబంధం వ్యవహారం వెలుగుచూసింది. దీనికి పట్టుకుని తీగలాగితో డొంక కదిలింది. హత్య జరిగిన రోజు.. అర్థరాత్రి దాటిన తర్వాత.. ఆమె ప్రియుడు ప్రదీప్, అతని ఫ్రెండ్స్ శివకుమార్, ప్రసాద్, నగేష్ లను చిల్డ్రన్ బెడ్ రూమ్ డోర్ నుంచి ఇంట్లోకి వచ్చేలా చేసింది. ఆ తర్వాత గాఢ నిద్రలో ఉన్న భర్త సోమకేశవులుని.. అరవకుండా టవల్ తో నోరు మూసేసి.. సుత్తెతో తలపై మోదారు. ఛాతిపైనా బలంగా కొట్టడంతో చనిపోయినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

భర్త చనిపోయాడని కన్ఫామ్ అయ్యాక.. ఐదుగురు కలిసి మృతుడిని ఇంటిముందు వరండాలో పడేశారు. స్వాతి సూచనల మేరకే.. పిల్లలున్న బెడ్ రూమ్ కు గడియ పెట్టి నిందితులు పరారయ్యారు. తెల్లవారుజామున ఏమీ తెలియనట్లుగా.. తన భర్తను ఎవరో చంపి.. వరండాలో పడేశారంటూ డ్రామా ఆడింది. అయితే.. పోలీసులు వచ్చేసరికి.. ఇంట్లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా తుడిచేసి.. ఆతర్వాత కారంపొడి చల్లి డాగ్ స్క్వార్డ్ సైతం పసిగట్టకుండా పక్కాగా ప్లాన్ చేసింది స్వాతి. మృతుడు సోమకేశవులు రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్, ఫైనాన్స్ పార్టనర్స్ లను విచారించినా ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో.. మృతుడు భార్య స్వాతి మీద అనుమానంతో.. ఫోన్ కాల్ డేటా ఆధారంగా.. ప్రియుడు ప్రదీప్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో అసలు మర్డర్ స్కెచ్ అంతా బైటపడింది. స్వాతి రెండు లక్షల రూపాయల సుపారీ ఇచ్చి.. తన భర్త సోమకేశవులు హత్యకు ప్లాన్ చేసిందనీ.. హత్య అనంతరం మొత్తం డబ్బు ఇచ్చిందని ఎ-1 నిందితుడు ప్రదీప్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. హత్యలో తన ఫ్రెండ్స్ శివకుమార్, ప్రసాద్, నగేష్ లు సహకరించారని ఒప్పుకున్నాడు.

తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే.. ప్రియుడు ప్రదీప్ తో కలిసి రెండు నెలలుగా హత్యకు కుట్రకు ప్లాన్ చేసిందనీ.. నల్లగొండ ఇంఛార్జ్ ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఫేస్ బుక్ లో పరిచయమైన ప్రదీప్ తో మూడేళ్ళ నుంచి స్వాతి అక్రమ సంబంధం కొనసాగిస్తుందని విచారణలో వెల్లడైంది. భార్య స్వాతి తోపాటు.. మరో నలుగురిని రిమాండ్ కు తరలించారు పోలీసులు. సోమకేశవులు మర్డర్ కేసులో.. ఏ1 గా ప్రియుడు దుబ్బ ప్రదీప్, ఏ2 భార్య స్వాతి, ఏ3 కుంభం ప్రసాద్, ఏ4 కోడిదేటి శివకుమార్, ఏ5 గా చింతపల్లి నగేష్ లను ఎఫ్.ఐ.ఆర్. లో పొందుపర్చి.. నిందితులను అందరినీ రిమాండ్ కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story