20 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన బస్టాండ్‌

20 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన బస్టాండ్‌

సరిగ్గా 20 ఏళ్ల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఓ బస్‌ స్టాండ్‌ ప్రారంభోత్సవం చేశారు. అప్పుడాయన ఉమ్మడి ఏపీ రవాణా శాఖ మంత్రి. ఆ బస్టాండ్‌ ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరింది. నిలువనీడలేకుండా ట్రాఫిక్‌లో ప్రయాణీకులు అవస్థలు పడుతున్నా ఎవరికీ పట్టడంలేదు. ఆ పట్టణం ఎక్కడుంది. అక్కడ అసలేం జరిగింది.

నల్గొండ జిల్లాలోని నకిరేకల్ పట్టణం. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఉండటంతో నిత్యం ప్రయాణీకులు రద్దీ నెలకొంటుంది. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట ప్రస్తుతం సీఎం కేసీఆర్, అప్పటి రవాణా శాఖ మంత్రి కొత్త బస్టాండ్‌ ప్రారంభోత్సవం చేశారు. కొంతకాలంపాటు హైదరాబాద్- విజయవాడపై వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఆగేవి. ఆ తర్వాత హైవే విస్తరణలో భాగంగా పట్టణ శివారుల మీదుగా బైపాస్‌ నిర్మించారు. ఆర్టీసీ బస్సులన్నీ బైపాస్‌ మీదుగా వెళ్లడం ప్రారంభించాయి. దీంతో బస్సులు ఆగడం పూర్తిగా తగ్గిపోయింది. మౌలిక సదుపాయాల లేమి, నిర్వహణలోపంతో ఇటువైపు ప్రయాణీకులు కన్నెత్తిచూసేవారు కరువయ్యారు...

తెలంగాణరాష్ట్రం ఏర్పడ్డాక... ఈ బస్టాండ్‌కు పూర్వ వైభవం వస్తుందని భావించారు. అయితే అది కలగానే మిగిలింది. మాజీ ఎమ్మెల్యే వీరేశం బస్టాండ్‌ ను రీ-ఓపెన్‌ చేయించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిర్వహణలోపంతో ఆర్టీసీ బస్టాండ్‌ ఆనవాళ్లు లేకుండాపోతోంది. మరోవైపు నకిరేకల్‌లో బస్సు ఆపడానికి కూడా కండక్టర్‌లు ఇష్టపడటంలేదు. చీకటైతే ఊళ్లోకి రామంటున్నారు డ్రైవర్లు.

Tags

Read MoreRead Less
Next Story