కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో..

కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో..
X

తమిళనాడులో పరువు హత్య కలకలం రేపుతోంది. కుమార్తె దళితుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో అతి దారుణంగా నరికి చంపాడో తండ్రి. కూతురుతో పాటు అల్లుడినీ కిరాతకంగా హత్య చేశాడు. తూత్తుకుడి జిల్లా విలాత్తుపురంలో చోటు చేసుకుంది.

ఒకే గ్రామానికి చెందిన షోలేరాజా, జ్యోతి రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జ్యోతి తండ్రి అళగర్‌కు ఆ వివాహం ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో ఇంటికి దూరంగా వేరే కాపురం పెట్టారు నవ దంపతులు. రెండేళ్ల నుంచి ఆగ్రహంతో రగిలిపోతున్న అళగర్.. సమయం చూసి వేటు వేశాడు. దంపతులిద్దరినీ నరికి చంపేశాడు.

అల్లుడిని, కూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడు.. ఆ తర్వాత పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి తమిళనాడు ప్రభుత్వం పాతిక లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

Next Story

RELATED STORIES