అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి..

X
TV5 Telugu6 July 2019 4:11 PM GMT
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి మృతి చెందాడు. విహారయాత్ర కోసం కుటుంబ సమేతంగా ఒక్లహం టర్నర్ జలపాతానికి వెళ్లిన నూనె సురేశ్ ప్రమాదావశాత్తు నీటిలో పడి చనిపోయాడు. ప్రకాశం జిల్లాకు చెందిన సురేశ్ డల్లాస్ లో స్థిరపడ్డాడు. సింతెల్ కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు పాప, బాబు ఉన్నారు. విహారయాత్రకు వెళ్లి, ప్రమాదావశాత్తు టర్నర్ జలపాతంలో మృతి చెందాడు.
సురేశ్ మృతదేహాన్ని రెస్క్యూ టీం ఆస్పత్రికి తరలించింది. ఆయనకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే మృతదేహాన్ని తరలించడానికి 80 వేల డాలర్లు కావాలి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఫండ్ రేజింగ్ వెబ్ సైట్‌ళో అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు తమకు తోచిన విధంగా సహాయం అందిస్తున్నారు.
Next Story