జేడీఎస్ శాసనసభాపక్షం అత్యవసరంగా సమావేశం..!

జేడీఎస్ శాసనసభాపక్షం అత్యవసరంగా సమావేశం..!

కర్ణాటక సంక్షోభం ముదురుతోంది. ఎమ్మెల్యేల రాజీనామాతో అమెరికా టూర్ నుంచి హుటాహుటీన వచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామి బెంగళూరు చేరుకోన్నారు. జేడీఎస్ శాసనసభాపక్షం అత్యవసరంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కుమారస్వామి కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ వేణుగోపాల్ తో భేటీ అవుతారు. ఎమ్మెల్యేల రాజీనామాలు, ప్రస్తుత సంక్షోభంపై చర్చిస్తారు. అటు మంగళవారం కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. అందరూ హాజరుకావాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు..అటు మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా బాటలో ఉన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి..

కర్ణాటక రాజకీయాలు ముంబైని హీటెక్కిస్తున్నాయి.. రాజీనామా చేసిన కాంగ్రెస్- జేడీఎస్ ఎమ్మెల్యేలంతా అక్కడి సోఫిటెల్ హోటల్ లో మకాం వేశారు. ఇక్కడి నుంచే డ్రామా కొనసాగుతోంది. హోటల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.. మీడియాను అనుమతించడం లేదు. అటు రెబల్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అసంతృప్త నేత నాగేంద్రకు బెంగళూరు రావాలంటూ కబురందించారు. రెబల్స్ అందరికీ మంత్రి పదవులు ఆఫర్ చేస్తోంది కాంగ్రెస్...

జేడీఎస్ చీఫ్ దేవగౌడ నేరుగా కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యే కారణమని దేవగౌడ సంచలన ఆరోపణలు చేశారు.. వాస్తవానికి జేడీఎస్ తో చేతులు కలపడం, కుమారస్వామి సీఎం పీఠంపై కూర్చోవడం సిద్ధరామయ్యకు మొదటి నుంచి ఇష్టం లేదు. ఆయనే పార్టీలో అసంతృప్తులను ప్రోత్సహిస్తున్నారన్న వాదన బలంగా ఉంది. అటు పలువురు కాంగ్రెస్ సీనియర్లే ..కాంగ్రెస్ లోనే ఇంటి దొంగలు ఉన్నారని వ్యాఖ్యనించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story