విషాదం.. పాము కరిచిన రైతును ఇంటికి తీసుకెళ్లడానికి వాహనం లేక...

ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాజేడు మండలం కొప్పునూరుకు చెందిన రైతు పాము కాటుకు గురైయ్యాడు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించేలోపే మృతి చెందాడు. ఇంటికి తీసుకువచ్చేందుకు వాహనాలు కూడా అందుబాటులో లేకపోవడంతో జోలె కట్టి పొలం నుంచి మరణించిన రైతును స్వగ్రామానికి తీసుకువచ్చారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో దయనీయమైన పరిస్థితులకి, రైతుల ఆర్థిక స్థితికి అద్దంపడుతుందీ దృశ్యం. తోటి రైతు పొలంలోనే కుప్పకూలిన విషయం గుర్తించి మిగతా వాళ్లు కాపాడే ప్రయత్నం చేసినా.. కొనఊపిరితో ఉన్న ఆ ప్రాణం నిలబడలేదు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని ఇంటికి చేరుద్దామన్నా వాహనాలు కూడా వారి దగ్గర అందుబాటులో లేవు. ఫోన్ చేసి ఊళ్లో ఉన్న వాళ్లకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినా, వాళ్లు వచ్చినా తీసుకు వెళ్లేందుకు మరో మార్గం లేక.. చివరికి లుంగీలోనే అతన్ని ఆస్పత్రిలో చేర్చే ప్రయత్నం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com