చంద్రబాబు సహా, ఇతర పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నా వెనక్కితగ్గని వైసీపీ వర్గీయులు

ఏపీలో రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయి. ఎన్నికలు ముగిసి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా ఘర్షణల ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా చాలా చోట్ల టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులే లక్ష్యంగా వైసీపీ వర్గీయులు దాడులు చేస్తూన్నారు. ఈ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా, ఇతర పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నా.. వైసీపీ వర్గీయులు వెనక్కు తగ్గడం లేదు.

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురంలో వైసీపీ వర్గీయుల దాడిలో టీడీపీకి చెందిన మురళి, సుజన్‌, రాజులు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికలకు ముందు గొడవలను మనసులో పెట్టుకొని వైసీపీ వర్గీయులు కత్తులతో మురళి, సుజన్‌, రాజులపై కత్తులతో దాడులకు దిగారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు తిరగబడడంతో ఇరు వర్గాలకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..

శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేపైనే దాడికి దిగారు కొందరు. సోంపేట మండలం పలాసపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్ర ప్రారంభోత్సవానికి వెళ్లిన ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందళం అశోక్‌పై వైసీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. దీనిపై సీరియస్‌ అయిన ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురు పాడులో ఓ అక్రమ సంబంధా కారణంగా చెలరేగిన వివాదం.. రాజకీయ ఘర్షణకు దారితీసింది. టీడీపీ-వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షనలో ఆరుగురుకి గాయాలు అయ్యాయి. వెంటనే నరసరావుపేట ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story