ఏడాది క్రితం రెండో వివాహం చేసుకుని

ఏడాది క్రితం రెండో వివాహం చేసుకుని
X

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వెంకటగిరిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో రమేష్‌ పేత్రి, రితాలు కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే దంపతులు కాలి బూడిదయ్యారు. వీరిద్దరూ ఏడాది క్రితం రెండో వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని ప్రాధమిక నిర్ధరణకు వచ్చారు.

Next Story

RELATED STORIES