ట్రిపుల్ ఐటీలో కీచక టీచర్

బాసర ట్రిపుల్ ఐటీలో కీచక టీచర్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రసాయనశాస్త్ర విభాగాధిపతి రవిని సస్పెండ్ చేశారు. అటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా ఎస్పీ శశిధర్ రాజుతో కలిసి ట్రిపుల్ ఐటీని సందర్శించారు. కీచక టీచర్ ఇష్యూపై దాదాపు 2 గంటలపాటు క్యాంపస్ లోని అధికారులతో చర్చించారు. ఆ తర్వాత నిర్మల్ జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.
విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా అధికారులకు తెలపాలని సూచించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. కాలేజ్ ప్రాంగణంలో కంప్లైంట్ బాక్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు..అటు కీచక టీచర్ రవి పరారీలో ఉండటంతో ఆయనపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. తప్పులకు పాల్పడేవారు ఎంతటివారైనా శిక్షలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ శశిధర్ రాజు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com