Top

పొలాల్లో ఉండాల్సిన రైతులను రోడ్డెక్కించారు : చంద్రబాబు

రాజన్న రాజ్యం తెస్తామంటూ రైతు వ్యతిరేక రాజ్యం తీసుకొచ్చారని నిప్పులు చెరిగారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు. అన్నదాతలకు సమయానికి విత్తనాలు కూడా ఇవ్వని ప్రభుత్వం, రైతు దినోత్సవం జరపడం హాస్యాస్పదమని విమర్శించారు. సీఎం జగన్ 40 రోజుల్లో 40 అబద్ధాలు ఆడారని తెలుగు తమ్ముళ్లు ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, అమరావతిలో పార్టీ సీనియర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. విత్తనాల సమస్య, ప్రాజెక్టుల నిర్మాణం, గోదావరి నదీ జలాల వినియోగం, బందర్ పోర్టు వివాదంపై పార్టీ నాయకుల తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైసీీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొలా ల్లో ఉండాల్సిన రైతులను రోడ్డెక్కించారని, విత్తనాలు అడిగితే లాఠీ దెబ్బలు రుచి చూపిస్తున్నారని మండిపడ్డారు. విత్తనాల సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవ్వడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారూ చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు పనులపై దుష్ప్రచారం చేయడం తగదన్న చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను రద్దు చేసి దుమ్ముగూడెం లాంటి ప్రాజెక్టులను మళ్లీ చేపట్ట డానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాలను 13 జిల్లాలకు సమర్థంగా వినియోగించేలా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పించన్లు, ఇళ్ల నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాల అమలుపైనా చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజన్న రాజ్యం లో 14 లక్షల ఇళ్లు మాయం అయ్యాయని మండిపడ్డారు. బిల్లులు చెల్లించకుండానే ఇళ్లు కట్టినట్లు చూపి మాయం చేశారని ఆరోపించారు. పించన్ 3 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత 250 మాత్రమే పెంచి మోసం చేశారని దుయ్యబట్టారు. విజయసాయిరెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంపైనా ప్రభుత్వానికి ఓ విధానమంటూ లేకపోయిందని చంద్రబాబు వ్యంగ్యాస్త్రా లు సంధించారు. బందర్ పోర్టు విషయంలోనూ సీక్రెట్‌గా వ్యవహరిస్తున్నారని, ప్రజలను మోసం చేయడా నికే రహస్య జీఓలు ఇస్తున్నారని విమర్శించారు.బీమా క్లైమ్‌లు, సిఎంఆర్‌ఎఫ్ చెల్లింపులు, పెళ్లి కానుకలు, రంజాన్ తోఫాలను అన్నింటినీ నిలిపేశారని, ఇది తుగ్లక్ పాలన కాదా అని సూటిగా ప్రశ్నించారు. రేషన్ డీలర్ల వ్యవస్థ ను తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.

ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత ప్రభుత్వాలపై నిందలు మోపడం సరికాదని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని హితవు పలికారు. సీఎం వైఎస్ జగన్ 40 రోజుల్లో 40 అబద్దాలు ఆడారని టీడీపీ నేతలు విమర్శించారు. జగన్‌కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలను హింసించడం మానుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

Next Story

RELATED STORIES