తాజా వార్తలు

ఎల్ఐసీ కొత్త పాలసీ.. రోజుకు రూ.29లతో రూ.2 లక్షలు!

ఎల్ఐసీ కొత్త పాలసీ.. రోజుకు రూ.29లతో రూ.2 లక్షలు!
X

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) ఇటీవల మైక్రో బచత్ పేరుతో కొత్త పాలసీని తీసుకువచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన తొలి మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇది. రక్షణతో పాటు పొదుపు అంశాల కలయికతో ఈ పాలసీని రూపొందించారు. ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే ఈ పాలసీని తీసుకోవచ్చు. కనీసం రూ.50,000కు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు. మైక్రో బచత్ పాలసీని తీసుకునేవారు 18 నుంచి 55 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు. పాలసీని కనీసం 10 నుంచి 15 ఏళ్లపాటు కొనసాగించాలి. పాలసీ గడువు వరకు ప్రీమియం చెల్లించాలి. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి.. ఎలా వీలైతే అలా చెల్లించుకోవచ్చు. ప్రీమియం చెల్లింపునకు గ్రేస్ పీరియడ్ 30 రోజులు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసున్న వ్యక్తి 15 ఏళ్ల మైక్రో బచత్ ప్లాన్ ఎంచుకుని లక్షరూపాయల పాలసీని తీసుకున్నాడనుకుంటే .. ఆయన సంవత్సరానికి రూ.5,220 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.2 లక్షల పాలసీన తీసుకుంటే ఏడాదికి రూ.10,400 (అంటే నెలకు రూ.864, రోజుకు రూ.29) కట్టాలి. పాలసీ తీసుకున్న దగ్గరనుంచి వరుసగా మూడేళ్లు ప్రీమియం చెల్లించినట్లైతే రుణం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. 5 ఏళ్లు కొనసాగిన పాలసీలకు పన్ను మినహాయింపుతో పాటు, అదనపు సౌకర్యాలు కూడా వర్తిస్తాయి.

Next Story

RELATED STORIES