తాజా వార్తలు

వంద మందిపై బహిష్కరణ వేటు వేసిన గ్రామ కమిటీ

వంద మందిపై బహిష్కరణ వేటు వేసిన గ్రామ కమిటీ
X

నిజామాబాద్ జిల్లాలో గ్రామకమిటీల ఆగడాలు మితిమీరుతున్నాయి. తమ ఆదేశాలు దిక్కరించిన వారిపై సాంఘిక బహిష్కరణ వేటు వేస్తున్నారు.. ఆర్మూరు మండలం మగ్గిడిలో వడ్డెర కులస్తులను బహిష్కరించారు. గ్రామంలోని వడ్డెర కాలనీ వద్ద.. స్థానికులు బస్టాప్ కోసం షెడ్డు నిర్మిస్తున్నారు. అయితే దీని పక్కనే వడ్డెర సామాజిక వర్గానికి చెందిన సాయిలు అనే యువకుడు సైకిల్ మెకానిక్ షెడ్డు నడుపుతున్నాడు. ఈ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని గ్రామ కమిటీ పెద్దలు ఆదేశించారు. దీన్ని వడ్డెర కులస్తులు వ్యతిరేకించారు. దీంతో వంద మందిపై సాంఘిక బహిష్కరణ వేటు వేశారు. వారితో ఎవరూ మాట్లాడొద్దని, కూరగాయలు, నిత్యవసరాలు విక్రయించొద్దని హుకూం జారీ చేశారు. గ్రామకమిటీపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story

RELATED STORIES