కర్ణాటక సంక్షోభం.. ముంబై నుంచి గోవాకు మకాం మారుస్తున్న ఎమ్మెల్యేలు!

కర్ణాటక సంక్షోభం.. ముంబై నుంచి గోవాకు మకాం మారుస్తున్న ఎమ్మెల్యేలు!

కర్ణాటక సంక్షోభం కాంగ్రెస్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. తాజా పరిణామాలపై చర్చించడానికి కాంగ్రెస్ అగ్రనాయకులు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల రాజీనామా, ప్రభుత్వా న్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అటు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, జి.పరమేశ్వర తదితరులు బెంగళూరులో సమావేశమై భవిష్యత్ కార్యాచర ణపై సమాలోచనలు జరిపారు. సమస్యను పరిష్కరించడానికి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను రంగం లోకి దింపారు. అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చించడానికి ఆయన ముంబై బయలుదేరి వెళ్లారు. ఐతే, డీకే రాకను పసిగట్టిన రెబల్ ఎమ్మెల్యేలు వ్యూహం మార్చారు. వారంతా ముంబై నుంచి గోవాకు మకాం మార్చ నున్నట్లు సమాచారం. అటు, జేడీఎస్ ఎమ్మెల్యేలను కూర్గ్‌లోని ఓ రిసార్టుకు తరలించారు. కొడగు-సోమ్‌వా ర్‌పేట లోని పడింగ్టన్ రిసార్టు లో ఎమ్మెల్యేల కోసం 35 గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది.

సోమవారం కర్ణాటకలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా నుంచి వచ్చిన సీఎం కుమార స్వామి, జేడీఎస్ నేతలతో సమావేశమై చర్చించారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు కూడా అత్యవసరంగా సమా వేశమై సమాలోచనలు జరిపారు. ఈ చర్చోపచర్చలు సాగుతుండగానే రాజీనామా వ్యవహా రం ముదిరింది. మంత్రి H.నగేష్ తన పదవికి రిజైన్‌ చేశారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు సమర్పించా రు. దీంతో రిజైన్ చేసినవారి సంఖ్య 14కు పెరిగింది. నగేష్, ఇటీవలే కుమార స్వామి కేబినెట్లో చేరారు. ఐతే, తనను సరిగా పని చేసుకోనివ్వడం లేదని, అందువల్లే మంత్రి పదవికి రిజైన్ చేశానని చెప్పారు. బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ కూడా ప్రభుత్వానికి ఝలకిచ్చారు. నగేష్, మహేష్‌లు బీజేపీకి మద్దతు ప్రకటిం చారు. మరో MLA అంజలి నింబల్కర్ కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం. ఐతే, సంక్షోభం త్వరలోనే సమసిపోతుం దని మాజీ సీఎం సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.

వరుస రాజీనామాలతో కలవరపడిన కాంగ్రెస్-జేడీఎస్ అగ్ర నేతలు, సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఆపరేషన్‌ కమల్‌కు చెక్ పెట్టి, అసంతృప్త ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగా కేబినెట్ మంత్రులంతా రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వ రతో పాటు కాంగ్రెస్‌కు చెందిన 21 మంది మంత్రులు, జేడీఎస్‌కు చెందిన మినిస్టర్లు రిజైన్ చేశారు. త్వర లోనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని కుమారస్వామి ట్వీట్ చేశారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్దమని సీనియర్ నేత డీకే శివకుమా ర్ పేర్కొన్నారు.

అటు, ప్రతిపక్ష బీజేపీ కన్నడ ఎపిసోడ్‌ను నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశమై ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం బలాన్ని కోల్పోయిందని, ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ఎపిసోడ్‌పై లోక్‌సభలో రగడ చెలరేగింది. జీరో అవర్‌లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరీ కర్ణాటక రాజకీయ సంక్షోభాన్ని ప్రస్తావించారు. కన్నడనాట పరిణా మాలకు బీజేపీ కారణమని ఆరోపించా రు. ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. కన్నడ రాజకీయ సంక్షోభంతో బీజేపీకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అసంతృప్త ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్‌లో లేదని తేల్చి చెప్పింది. రాజీనామాల ఎపిసోడ్‌కు రాహుల్ గాంధీనే కారణమని, రిజైన్ చేయాలంటూ రాహుల్ అందరినీ అడుగుతున్నారని ఎదురు దాడి చేసింది.

బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కమలదళం ప్రయత్నిస్తోందని మండిపడింది. బీజేపీ తీరుకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. బీజేపీ కూడా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది.

Tags

Read MoreRead Less
Next Story