హైదరాబాద్‌లో బోనాల సందడి

హైదరాబాద్‌లో  బోనాల సందడి

హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బొనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మహిళలు. అటు... సికింద్రాబాద్‌ మహంకాళీ బొనాలు సైతం ఘనంగా ప్రారంభమయ్యాయి.హైదరాబాద్ గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జగదాంబికా అమ్మవారికి ఘటాలు సర్పించేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగాలు, డప్పు దరువులతో గోల్కొండ ప్రాంతం భక్త జన సంద్రంగా మారింది. ఈనెల 4వ తేదీన గోల్కొండ బోనాలు ప్రారంభం కాగా... ఆదివారం రెండో బోనం సమర్పించారు.... మరోవైపు..... హైదరాబాద్‌కు ఐకాన్‌ లాంటి సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచకంగా ఘటోత్సవాన్ని నిర్వహించారు. 15 రోజుల పాటు అమ్మవారు సికింద్రాబాద్‌ పుర వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 21 న లష్కర్‌ బోనాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 22 న రంగం, గజారోహణం నిర్వహించనున్నారు. వేడుకల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్.

ఇక ప్రతిష్టాత్మక బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణ మహోత్సవం మంగళవారం జరగనుంది. బుధవారం రథోత్సవం జరగనున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు.... 12వ శతాబ్ధానికి ముందే తెలంగాణలో బోనాలు ప్రారంభమ్యాయి. అప్పట్నుంచి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు జరుపుకోవడం ఆనవాయితీ. హైదరాబాద్ లోని గోల్కొండలో మొదటగా బోనాలు మొదలవుతాయి. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో బోనాలు జరుపుకుంటారు. చివరగా పాతబస్తీలోని లాల్ దర్వాజ బోనాలతో ముగుస్తాయి..

Tags

Read MoreRead Less
Next Story