ర్యాగింగ్ భరించలేక పదో తరగతి విద్యార్థి..

ర్యాగింగ్ భరించలేక పదో తరగతి విద్యార్థి..

ఇప్పటివరకు కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం స్కూళ్లకు కూడా పాకింది. తోటి విద్యార్థుల ర్యాగింగ్ భరించలేక ఓ పదో తరగతి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్ కర్మాన్‌ ఘాట్‌ లో జరిగింది.

గ్రీన్‌పార్క్‌ కాలనీకి చెందిన రవికిరణ్ న్యూ రాయల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేసి, డబ్బులు తీసుకురావాలని బెదిరించారు. దీంతో రవికిరణ్ తల్లిదండ్రులకు తెలియకుండా 6 వేల రూపాయలు స్నేహితులకు ఇచ్చాడు. మళ్లీ మళ్లీ డబ్బులు తీసుకురావాలని బెదిరించడంతో రవికిరణ్.. స్కూల్‌ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌ లైట్‌ గా తీసుకున్నాడు. మరోవైపు స్నేహితులు డబ్బుల కోసం వేధించడంతో రవికిరణ్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తల్లిదండ్రులు కొడుకును హుటాహుటిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవికిరణ్ కోలుకుంటున్నాడు. మరోవైపు వేధింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై రవికిరణ్ తల్లిదండ్రులు.. న్యూ రాయల్‌ స్కూల్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story