న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్న భారత బౌలర్లు

వరల్డ్‌కప్ తొలి సెమీఫైనల్లో భారత బౌలర్లు.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్... తొలి బంతి నుంచే ఆపసోపాలు పడుతోంది. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు.. బ్యాట్స్‌మెన్‌కు ఊపిరి సలపనివ్వడం లేదు. తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన గప్తిల్ ఆ తర్వాత కొద్ది సేపటికే వికెట్ సమర్పించుకున్నాడు. ఒక పరుగుకే బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఓపెనర్ నికోల్స్.. కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి ఆచి తూచి ఆడాడు. అయితే 28 పరుగులు చేసిన నికోల్స్ జడేజా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతమున్న రన్‌రేట్ ప్రకారం న్యూజిలాండ్ జట్టు 250 పరుగులకు మించి చేసే అవకాశాలు కనిపించడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com