సాయంత్రం శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన స్పీకర్ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. రేపట్నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 14 పని దినాలపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సెలవులతో కలిపి ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 12న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెడతారు.
మరోవైపు.... ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఈ సాయంత్రం శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్... శ్వేతపత్రం విడుదల చేస్తారు. వైసీపీ సర్కారు తొలిసారిగా శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు 2019–20 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడుతారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మండలిలో సభా నాయకుడు, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com