డికే శివకుమార్‌‌ను అడ్డుకున్న పోలీసులు

డికే శివకుమార్‌‌ను అడ్డుకున్న పోలీసులు
X

కర్నాటకలో పొలిటికల్‌ హైడ్రామా కొనసాగుతూనే ఉంది.. క్షణక్షణానికీ మారిపోతున్న పరిణామాలతో కర్నాటక సంక్షోభం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.. క్యాంపు రాజకీయాలతో కర్నాటక నుంచి సీన్‌ ముంబైకి మారింది.. అసంతృప్తులను తమ దారికి తెచ్చుకునేందుకు సీఎం కుమారస్వామి, ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. ముంబైలో మకాం వేసిన రెబెల్‌ ఎమ్మెల్యేలను కలిసేందుకు డీకే శివకుమార్‌తోపాటు జేడీఎస్‌ ఎమ్మెల్యే శివలింగ గౌడ ముంబై వెళ్లారు.. రెబెల్‌ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌కు వెళ్లారు.. అయితే, డీకే శివకుమార్‌ను హోటల్‌లోకి వెళ్లనివ్వకుండా ముంబై పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కుమారస్వామి, డీకే శివకుమార్‌ వల్ల ముప్పు ఉందని రెబెల్‌ ఎమ్మెల్యేలంతా రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన్ను హోటల్‌లోకి అనుమతివ్వలేదు.. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.. పోలీసులు ససేమిరా అనడంతో శివకుమార్‌ అక్కడ్నుంచి వెనుదిరిగారు.. అయితే, తాను సన్నిహితులను కలిసేందుకు వచ్చానని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎమ్మెల్యేలను కలిసే వెళ్తానని స్పష్టం చేశారు.

అటు రెబెల్‌ ఎమ్మెల్యేలు బస చేసిన ముంబైలోని హోటల్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.. ఎమ్మెల్యేలను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు..కర్ణాటకలో స్పీకర్‌ నిర్ణయంతో కాస్త ఉపశమం కల్గిందని భావించినా... సస్పెన్స్‌ మాత్రం కొనసాగుతునే ఉంది. ముంబైలో రెబల్‌ ఎమ్మెల్యేను బుజ్జిగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్‌ - జేడీఎస్‌. ఇందుకోసం కర్ణాటక మంత్రి డికే శివకుమార్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యే శివలింగ గౌడ.... ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు బస చేస్తోన్న హోటల్‌ వద్దకు చేరుకున్నారు. అయితే... వీరిద్దరిని అడ్డుకున్నారు పోలీసులు. లోపల్నికి వెళ్లనిచ్చేది లేదన్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే తాను తన స్నేహితులను కలుసుకునేందుకు వచ్చానన్నారు డికే శివకుమార్‌. రెబల్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే ముంబై పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. తమను కలిసేందుకు వచ్చే నేతలనుంచి రక్షణ కల్పించాలంటూ... లేఖలో కోరారు. దీంతో హోటల్‌ వద్ద భారీగా పోలీస్‌ బందో బస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. హోటల్‌లో ఎవ్వరిని అనుమతించడం లేదు.

Next Story

RELATED STORIES