మోదీ ఆదేశం.. దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీల పాదయాత్ర..

మోదీ ఆదేశం.. దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీల పాదయాత్ర..
X

పాదయాత్రల ట్రెండ్ బీజేపీని తాకింది. బీజేపీ ఎంపీలు త్వరలో పాదయాత్ర చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకు అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు పాదయాత్ర చేపట్ట నున్నారు. ఒక్కో ఎంపీ దాదాపు 150 కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించనున్నారు. ఎంపీల పాదయాత్రలో బీజేపీ ఎమ్మెల్యే లు, ఇతర నాయకులు పాల్గొననున్నారు.

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మాగాంధీ జయంతి. ఈసారి బాపూజీ 150వ జయంతి వేడుకలు నిర్వహించను న్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ కొత్త ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 2న ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించాలని మోదీ ఆదేశించారు. అక్టోబర్ 2న యాత్ర మొదలుపెట్టి దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు అక్టోబర్ 31న ముగించాలని సూచించారు. ప్రతి ఎంపీ దాదాపు 150 కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పార్టీ ఎంపీలు లేని చోట రాజ్యసభ సభ్యులు పాదయాత్ర చేయాలని సూచించారు.

Next Story

RELATED STORIES