సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా?

సీఎం పదవికి  కుమారస్వామి రాజీనామా?

కర్నాటకం కొత్త మలుపు తిరిగింది. సీఎం కుమారస్వామిపై మొదటి నుంచి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు, చివరికి అనుకున్నది సాధించినట్లే కనిపిస్తోంది. ఎమ్మెల్యేల అసమ్మతి గోల, రాజీనామాల రచ్చను భరించలేక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని కుమారస్వామి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడతో కుమారస్వామి మంతనాలు జరిపారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించడానికే రాజీనామాల వ్యవహారం సాగుతోందని కుమారస్వామి పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీఎం మార్పుతోనైనా రాజకీయ సంక్షోభానికి తెరపడుతుందేమో అని తండ్రీకొడుకులు భావించినట్లు సమాచారం. తర్జనభర్జనల అనంతరం సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమారస్వామి తీర్మానించినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఆయన రిజైన్ చేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక, రాజీనామాలపై కాంగ్రెస్ నాయకత్వానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజు, కె.సుధాకర్‌లు కూడా రిజైన్ చేశారు. దీంతో రాజీనామా చేసినవారి సంఖ్య 16కు పెరిగింది. సుధాకర్‌తో మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఐతే, నాగరాజు రిజైన్ ఎపిసోడ్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. స్పీకర్ చాంబర్‌లోనే కాంగ్రెస్ వర్గీయులు ఘర్షణకు దిగారు. నాగరాజు రాజీనామాను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను, నాగరాజు మద్దతుదారులు అడ్డు కున్నారు. దీంతో గొడవ చెలరేగింది. మాజీ సీఎం యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రతి నిధుల బృందం అసెంబ్లీ స్పీకర్ రమేష్‌ కుమార్‌ను కలిసింది. ఎమ్మె ల్యేల రాజీనామాలపై పక్షపాతం లేకుండా వ్యవహ రించాలని కోరింది. అనంతరం యడ్యూరప్ప గవర్నర్ వజూబాయ్ వాలాను కలిశారు. స్పీకర్ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story