మళ్లీ మొదలయ్యింది.. రెండు గంటల్లోనే 789 మిల్లీ మీటర్ల వర్షం

మళ్లీ మొదలయ్యింది.. రెండు గంటల్లోనే 789 మిల్లీ మీటర్ల వర్షం

దేశవాణిజ్య రాజధాని ముంబైను మరో సారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి . గతకొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం నానా అవస్థలు పడుతున్నారు. రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన వాన.. మళ్లీ మొదలయ్యింది. రెండు గంటల పాటు కురిసిన అతి భారీ వర్షానికి ముంబై వీధులు మరోసారి సముద్రాన్ని తలపించాయి. దీంతో ఒక్కసారిగా ముంబై నగరం స్తంభించింది.

గంటలపాటు ట్రాఫిక్ స్తంభించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో నగరవాసులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ప్రత్యక్ష నరకాన్ని చూశారు.. పలు రైళ్లను అధికారులురద్దు చేశారు.ఇటు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రెండు గంటల్లోనే 789 మిల్లీ మీటర్ల రికార్డు వర్షపాతం నమోదైందని స్కైమేట్ అంచనా వేసింది ..

ఇవాళ కూడా ముంబై, దక్షిణ కొంకణ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రయ్‌గడ్, థానే, పల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలో ఇవాల్టి నుంచి శుక్రవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు 'సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. కెరటాలు 40-50 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతున్నట్టు పేర్కొంది. దీంతో అప్రమత్తమైన మహాసర్కార్ అధికారుల్ని అలర్ట్ చేసింది..

Tags

Read MoreRead Less
Next Story