తాజా వార్తలు

ప్రియుడి మోజులో పడి.. భర్తపై..

ప్రియుడి మోజులో పడి.. భర్తపై..
X

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.... కట్టుకున్న భర్తల్ని కడతేరుస్తున్న భార్యల సంఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం క్రితం నల్లగొండలో భర్త సోమకేశవుల హత్యను మరిచిపోకముందే... ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో

సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. ప్రియుడి మోజులో పడి భర్త మల్లేష్‌ను హతమార్చింది భార్య మమత..

చిత్తలూరులో భార్య మమతతో కలిసి ఉంటున్నాడు మల్లేశం. అయితే భార్య మమతకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు మందలించాడు భర్త. ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఆమె తన మాట వినకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు మల్లేశం.

అయితే.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన మమత... నిన్న రాత్రిపూట తన ఇంట్లోనే మల్లేష్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. మమతే హత్య చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మల్లేషం కుటుంబ సభ్యులు. అయితే దీనిపై మమత మాత్రం నోరు విప్పడం లేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మల్లేశం తలపై, ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు.

Next Story

RELATED STORIES