Top

ఎవరీ కోగంటి సత్యం..!

ఎవరీ కోగంటి సత్యం..!
X

కోగంటి సత్యనారాయణ... అలియాస్ కోగంటి సత్యం.! పేద కుటుంబం నుంచి వచ్చిన సత్యం.. ఎవరికి పనికిరాని ఇనుప తుక్కుని నమ్ముకున్నాడు. ఆ తుక్కే సత్యం రేంజ్ ని ఓ స్థాయికి పెంచింది. ఆస్తులతోపాటే శత్రువులనూ పెంచింది. అయితే బిజినెస్ లో తనకు అడ్డువచ్చిన వారిని సింపుల్ గా తొలగించుకోవడంలో అతనికి అతడే సాటి. విజయవాడలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కోగంటి సత్యంపై కేసులున్నాయంటే అతడి సెటిల్ మెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ రికార్డుల ప్రకారం కోగంటి సత్యంపై 26 కేసులున్నాయి. అయితే ఇందులో

15కిపైగా కేసుల్ని కొట్టివేశారు..

వివాదాలు సత్యం కొత్తకాదు. సత్యానికి వివాదాలు కొత్తకాదు. గతంలో CSI ఆస్తులు కొనుగోలు వివాదం, భారీ గణపతి విగ్రహ వివాదం, బొండా ఉమాతో గొడవ, కిడ్నాప్ లు, దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టులో ఇంకా చాలా ఆగడాలే ఉన్నాయి. ఇలా కోగంటి బయటకి చూడటానికి ఒకలా...ఆయన చేసే పనులు మరోలా ఉంటాయి. కృష్ణలంకలోని సత్యం దొడ్డి వద్దకు వెళితే అడిగితే లేదనకుంటా ఏదోటి ఇచ్చి పంపుతాడు అనే పేరు ఉంది. అలాగే నగరంలో ఎవరినైనా అడ్డుతొలగించుకోవాలనుకుంటే కూడా ఆ సత్యం దొడ్డికి వెళితే చాలు అన్న ప్రచారమూ ఉంది. సత్యం ఆగడాలు శృతిమించడంతో గతంలో ఓసారి ఆయనపై నగర బహిష్కరణ కూడా విధించారు బెజవాడ పోలీసులు.

కోగంటి సత్యనారాయణ, టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు కొండపల్లి పారిశ్రామిక వాడలో నెలకొల్పిన S.D.V.స్టీల్స్ ని లీజుకుతీసుకున్నారు రాంప్రసాద్. ఆ తర్వాత 2005లో ఈ ఫ్యాక్టరీ పేరుని కామాక్షి స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారు. కుటుంబ సభ్యులు, బంధువులను డైరెక్టర్లుగా నియమించారు. రాంప్రసాద్, అతని బావమరిది శ్రీనివాస్ కి విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్ , వైజాగ్ లోనూ రమ్యా స్టీల్స్ పేరు మీద షాపులున్నాయి. అయితే గతంలో రామప్రసాద్ .. S.D.V. స్టీల్స్ లో ఉత్పత్తయ్యే సరుకులో 80 శాతం మార్కెటింగ్ చేసేవారు. ఆ తరువాత లీజు ఒప్పందం ముగిసింది. లీజు ప్రకారం తమకు ఇవ్వాల్సిన డబ్బులతో పాటు..తుక్కు సరఫరాదారులకు కూడా రాం ప్రసాద్ భారీగా టోకరా పెట్టారని సత్యం ఆరోపించారు. దీంతో సత్యం, రాంప్రసాద్ మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి..

ఆ తరువాత కొంత మంది పెద్దమనుషుల సమక్షంలో సత్యం, రాంప్రసాద్ మధ్య సెటిల్ మెంట్ జరిగింది. అయితే ఈ డీల్ ను రాంప్రసాద్ పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేది. ఆ ప్రతీకారం, పగే ... 5 ఏళ్ల తర్వాత రాం ప్రసాద్ హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే సత్యంను ఈ కేసులోంచి తప్పించేందుకే తెలివిగా మధ్యలో శ్యామ్ ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు.పైగా కేసుని పూర్తిగా డైవర్ట్ చేసేందుకు రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాసే ఈ హత్యను చేయించాడని చెప్పారు. అయితే శ్యామ్ భార్య మాత్రం ఈ హత్యకి సత్యానికి సంబంధంలేదని చెబుతోంది..

అలా విజయవాడలో మొదలైన వివాదం.. హైదరాబాద్ పంజాగుట్టలో రాంప్రసాద్ మర్డర్ కు దారితీసింది..ఈ మర్డర్ లో పాత్రధారులెవరైనా.. సూత్రధారి మాత్రం సత్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అందుకే అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే కోగంటి సత్యంపై రౌడీషీట్ ఉంది. ఈ కేసులోనూ దోషిగా రుజువైతే కఠిన శిక్ష తప్పకపోవచ్చని భావిస్తున్నారు.

Next Story

RELATED STORIES