కర్నాటక సంకీర్ణ సంక్షోభం.. రాజీనామాలపై ఇవాళే తేల్చేయండి : సుప్రీంకోర్టు

కర్నాటక సంకీర్ణ సంక్షోభం.. రాజీనామాలపై ఇవాళే తేల్చేయండి :  సుప్రీంకోర్టు

కర్నాటక సంకీర్ణ సంక్షోభంలో మరో మలుపు. తమ రాజీనామాలను స్పీకర్ రమేష్‌ కుమార్‌ ఆమోదించడం లేదంటూ రెబల్‌ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇవాళ సాయంత్రం 6 గంటల కల్లా సభాపతి కార్యాలయంలో హాజరు కావాలని వాళ్లకు ఆదేశించింది. రాజీనామాలపై ఇవాళే తేల్చేయాలని స్పీకర్‌ రమేష్‌కు సూచించింది సర్వోన్నత న్యాయస్థాం. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.

కర్నాటకీయానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో శుభంకార్డు పడుతుందా? రాజీనామాలు పోస్టులో పంపితే ఎలా ఆమోదిస్తానంటూ గతంలో కామెంట్ చేసిన స్పీకర్‌ రమేష్‌కుమార్.. ఆ వెంటనే.. కొన్ని రాజీనామాలు సరైన ఫార్మాట్‌లో లేవని స్పష్టంచేశారు. సరైన ఫార్మాట్‌లో ఉన్నవిగా భావించిన రిజైన్లపై ఆయన నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు.. నిన్న మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేశారు. వారిని కాంగ్రెస్‌ కేడర్‌ అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఎమ్మెల్యేల రాజీనామాపై ఇవాళే తేల్చండని కర్నాటక స్పీకర్‌ రమేష్‌కుమార్‌కు సుప్రీంకోర్టు సూచన చేసింది. సభాపతి కార్యాలయంలో రెబల్స్‌ హాజరయ్యే సమయంలో పటిష్ట భద్రత కల్పించాలని కర్నాటక డీజీపీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. నిన్న జరిగిన తరహాలో ఉద్రిక్తతలకు తావులేకుండా చూడాలని స్పష్టంచేసింది.

Tags

Read MoreRead Less
Next Story