కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్టు

కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్టు
X

కర్ణాటక రాజకీయాల్లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. సీఎం కుమారస్వామి గెస్ట్‌ హౌస్‌లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతల భేటీ ముగిసింది. రాజీనామా విషయంలో సీఎం కుమారస్వామి వెనక్కి తగ్గారు. సీఎం రాజీనామాకు దారితీసే పరిస్థితుల్లేవని మంత్రి డి.కె.శివకుమార్ అన్నారు. 2008లో యడ్యూరప్ప ప్రభుత్వం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొందన్నారు శివకుమార్. అప్పుడు ఆయన కూడా రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే పద్ధతిలో కుమారస్వామి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. అటు కేబినెట్‌ భేటీ కొనసాగుతోంది. మరోవైపు కర్ణాటక పరిణామాలపై కీలక సూచనలు చేసింది. రాజీనామాపై ఇవాళే నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక స్పీకర్‌కు సుప్రీం కోర్టు సూచించింది.

Next Story

RELATED STORIES