ఆ తర్వాతే అయోధ్య కేసు విచారణ : సుప్రీంకోర్టు

ఆ తర్వాతే అయోధ్య కేసు విచారణ : సుప్రీంకోర్టు

రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్‌ సింగ్‌ విశారద్‌ వేసిన కీలక పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదన్నది ఆయన తరఫు న్యాయవాది వాదన. ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయస్థానమే పరిష్కారం చూపాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యవర్తిత్వ కమిటీ వారంలోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఆ నివేదికను పరిశీలించి.. అదేరోజు.. తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టంచేసింది. మధ్యవర్తిత్వ కమిటీ సామరస్య పరిష్కారం చూపించలేకపోతున్నట్లయితే.. జులై 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ధర్మాసనం తేల్చిచెప్పింది.

అయోధ్య వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించే మార్గాలపై ఈ ఏడాది మార్చి 8న సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యుల కమిటీ వేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ ఖలీఫుల్లా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు అందులో సభ్యులు. తాము జరిపిన సంప్రదింపులకు సంబంధించి మధ్యంతర నివేదికను ఆ కమిటీ ఈమధ్యే కోర్టుకు సమర్పించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు మరింత సమయం కావాలని మధ్యవర్తులు కోరారు. దీంతో ఆ కమిటీకి ఆగస్టు 15వరకు న్యాయస్థానం గడువు ఇచ్చింది.

మధ్యవర్తుల కమిటీ ప్రయత్నాలు కొనసాగుతుండగానే గోపాల్ సింగ్ విశారద్‌ పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంప్రదింపులతో లాభం లేదని ఆయన అంటున్నారు. ఈమేరకు ఈనెల 18 వారంలోగా అయోధ్యపై వాస్తవ నివేదిక అందించాలని ఆదేశించింది. ఆ నివేదికను పరిశీలించి అదే రోజు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఒకవేళ మధ్యవర్తిత్వ కమిటీ సామరస్య పరిష్కారం చూపించకపోతే జులై 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story