తాగడానికి డబ్బుల్లేవని కొడుకును అమ్మేశాడు!

తాగడానికి డబ్బుల్లేవని కొడుకును అమ్మేశాడు!
X

మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కొడుకునే అమ్మేశాడు. ఈ సంఘటన ఒడిషా రాష్ట్రంలోని నవరంగ్‌పూర్‌ జిల్లా పూజారిగూడలో చోటుచేసుకుంది. రూ.10 వేలకు కొడుకును ఓ ముఠాకు అమ్మేశాడు. పూజారిగూడకు చెందిన లోహర్‌ తాగుడుకు బానిసయ్యాడు. చివరకు తాగేందుకు డబ్బు లేకపోవడంతో భార్య చేతిలో ఉన్న కొడుకును బలవంతంగా లాక్కెళ్ళి ఓ ముఠాకు విక్రయించాడు. సమీపంలోని ఉన్న దేవాలయానికి భార్యను, ఏడునెలల కుమారుడిని తీసుకెళ్ళిన లోహర్‌ అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి రూ. 10వేలు తీసుకుని పసికందును అమ్మేశాడు. కుమారుడిని విక్రయిస్తున్న సమయంలో భార్య వద్దని వారించినప్పటికి వినకుండా ఆమెను కొట్టి పిల్లాడిని లాక్కొని వారికి అప్పగించాడు. అనంతరం అత్తవారింటికి వెళ్లి.. కొడుకు చనిపోయాడని వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అతడి మాటలు నమ్మనివారు కూతురును అడిగి అసలు విషయం తెలుసుకున్నారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Next Story

RELATED STORIES