గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కర్ణాటక రాజకీయ అనిశ్చితి.. పొరుగునే ఉన్న గోవాకూ పాకింది. గోవాలో కాంగ్రెస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆపార్టీ గుడ్‌ బై చెప్పారు. ప్రతిపక్ష నేత బాబూ కావ్లేకర్‌తో కలసి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమలదళంలో చేరిపోయారు. ఏకంగా సీఎల్పీని బీజేపీలో విలీనం చేసేశారు. వీరంతా గోవా స్పీకర్‌ను కలసి బీజేపీలో తమను విలీనం చేయాలని కోరారు.

గోవాలో కాంగ్రెస్‌కు మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. దాంతో కాంగ్రెస్ బలం ఐదుకు పడిపోయింది. బీజేపీ బలం 17 నుంచి 27 కి పెరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో సీఎం ప్రమోద్ సావంత్, డిప్యూటీ స్పీకర్ మైకెల్ లోబో కూడా అక్కడే ఉన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఎలాంటి షరతులు లేకుండా తమ పార్టీలో చేరారని పేర్కొన్నారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ పది మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి పయనమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story